ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్)లో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు.సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలతో గ్రామ, వార్డు సభల నిర్వహణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సభలు నిర్వహించాలని తెలిపారు. ఈ సభల్లో ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు ఏఎస్‌డీ (అబ్సెంట్, షిఫ్ట్, డెత్) జాబితాను బూత్ స్థాయి అధికారులు, సూపర్‌వైజర్ల సమక్షంలో చదివి వినిపించాలని సూచించారు.గ్రామ, వార్డు సభల సమయంలో బూత్ స్థాయి అధికారులు ఫారం-6, 7, 8లను అందుబాటులో ఉంచుకోవాలని, ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వాటిని నమోదు చేయాలని తెలిపారు. అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన వివరాలను బూత్ స్థాయి అధికారుల ద్వారా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించాలని సూచించారు.పెండింగ్‌లో ఉన్న నోటీసుల జనరేషన్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి సంబంధిత ఓటర్లకు నోటీసులు అందించాలని ఆదేశించారు. అవసరమైన చోట అదనపు ఏఈఆర్‌ఓల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలను రేపటిలోగా పంపించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ కె. హైమావతి మాట్లాడుతూ జిల్లాలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు సంబంధించిన నోటీసుల జనరేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయిందని తెలిపారు. కార్యాచరణ ప్రకారం ఈ నెల 27న గ్రామ, వార్డు సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. అదనపు ఏఈఆర్‌ఓల నియామకానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా పంపించినట్లు వెల్లడించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు