Friday, 25 September 2026 10:18:11 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

దళిత స్పీకర్‌పై వ్యాఖ్యలను ఖండిస్తూ పటాన్‌చెరులో కాంగ్రెస్ నిరసన

బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే సస్పెండ్ చేయాలి: కాట సుధా శ్రీనివాస్ గౌడ్

Date : 08 September 2026 05:00 PM Views : 45

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: దళిత స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ చేసిన అహంకారపూరిత, అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పటాన్‌చెరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. పటాన్‌చెరు డివిజన్‌లోని గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వైఖరిని ఖండిస్తూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రజాప్రతినిధులు హుందాతనంతో వ్యవహరిస్తూ రాజ్యాంగ విలువలను గౌరవించాలని సూచించారు. దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.రాజ్యాంగ పదవులకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు గౌరవం ఉండేలా ప్రజాప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన, మహిళా నాయకులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :