Monday, 09 November 2026 02:41:56 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!*

గోపురం నిర్మాణం కోసం ఇచ్చిన రూ.1.11 లక్షలు ఏమయ్యాయి...పోచమ్మతల్లి ఆలయ కమిటీ ఆర్థిక లావాదేవీలపై విచారణ కోరిన దాత, న్యాయవాది ప్రతిపతి మాధవ్*

Date : 05 November 2026 10:25 PM Views : 164

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * *?* * దేవుడి పేరుతో భక్తులు సమర్పించిన విరాళాలకు లెక్కలు చెప్పాల్సిందేనని, ప్రతి రూపాయి వినియోగంపై పారదర్శకత ఉండాలని ఆలయ దాత, న్యాయవాది ప్రతిపతి మాధవ్ డిమాండ్ చేశారు. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని మహదేవపురం కాలనీలో ఉన్న శ్రీ పోచమ్మతల్లి ఆలయ కమిటీ ఆర్థిక లావాదేవీలు, విరాళాల వినియోగం, నిర్మాణ పనుల ఖర్చులపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులకు సమగ్ర ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా గోపురం నిర్మాణం కోసం తాను ప్రత్యేకంగా అందించిన రూ.1,11,999 విరాళం ఏమైందో వెల్లడించాలని ప్రశ్నించారు. ఆలయ గోపురం నిర్మాణం కోసం 2025 మే 13న రూ.55,999.50, మే 14న మరో రూ.55,999.50 చొప్పున రెండు విడతల్లో ఆన్‌లైన్ ద్వారా మొత్తం రూ.1,11,999 విరాళంగా అందించినట్లు మాధవ్ తెలిపారు. ఈ మొత్తాన్ని సాధారణ ఆలయ ఖర్చుల కోసం కాకుండా ప్రత్యేకంగా గోపురం నిర్మాణం కోసమే ఇచ్చానని పేర్కొన్నారు. అయితే విరాళం స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు గోపురం నిర్మాణ పనులు ప్రారంభించకపోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ మొత్తం సొసైటీ బ్యాంకు ఖాతాలో జమైందా? ప్రస్తుతం ఖాతాలో ఉందా? ఇతర ఖర్చులకు వినియోగించారా? వినియోగిస్తే ఎవరి అనుమతితో ఖర్చు చేశారు? అనే అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.కమిటీ 2026 మే 14న అందించిన లెక్కల ప్రకటన ప్రకారం ఆలయానికి మొత్తం రూ.15,82,194 విరాళాల రూపంలో వచ్చినట్లు, వివిధ నిర్మాణ పనులు, ఇతర అవసరాల కోసం రూ.22,07,784 ఖర్చు చేసినట్లు చూపించారని మాధవ్ వెల్లడించారు. దీంతో రూ.6,25,590 లోటు ఉన్నట్లు, బ్యాంకు ఖాతాలో రూ.13,030 నిల్వ ఉన్నట్లు లెక్కల్లో పేర్కొన్నారని తెలిపారు. అధ్యక్షుడు నవీన్ కుమార్ అదనంగా రూ.6,12,560 ఖర్చు చేసినట్లు చూపించారని వివరించారు. అయితే ఈ ఖర్చులకు సంబంధించిన అసలు బిల్లులు, వోచర్లు, బ్యాంకు లావాదేవీలు, చెల్లింపు రసీదులు, నిర్మాణ పనుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు.కమిటీ ఖర్చుల పట్టికలో 2025 ఫిబ్రవరి 5 వరకు రూ.22,07,784 ఖర్చు చేసినట్లు చూపించారని, ఇందులో ఇసుక, సిమెంట్, స్టీల్, కంకర, జేసీబీ, క్రేన్, ట్రాక్టర్, కూలీల వేతనాలు, విద్యుత్ సామగ్రి, ఆలయ శిల్పి బాషాకు చెల్లింపులు తదితర అంశాలు ఉన్నాయని తెలిపారు. శిల్పి బాషాతో రూ.29 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అందులో రూ.17,26,350 చెల్లించినట్లు, ఇంకా రూ.11,73,650 చెల్లించాల్సి ఉన్నట్లు లెక్కల్లో పేర్కొన్నారని వివరించారు. ఈ చెల్లింపులకు సంబంధించిన ఒప్పంద పత్రాలు, బిల్లులు, నిర్మాణ పనుల కొలతలు, సామగ్రి కొనుగోలు రికార్డులు, కూలీల వేతనాల వివరాలను అధికారులు ధృవీకరించాలని డిమాండ్ చేశారు.ఆలయ కమిటీ ఆర్థిక లెక్కలపై వివరణ కోరిన సందర్భంలో తనను బెదిరించారని, కమిటీ అధ్యక్షుడు ఇలాపురం నవీన్ కుమార్ తనపై దాడికి పాల్పడి ప్రాణహాని కలిగించేలా హెచ్చరించారని మాధవ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ఈ సందర్భంగా తనను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొంటూ, తన నివాసానికి కొంతమంది కమిటీ సభ్యులు వచ్చిన సందర్భానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. అవసరమైతే ఆ ఆధారాలను అధికారులకు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించాలని కోరారు. శ్రీ పోచమ్మతల్లి ఆలయ కమిటీ 2024 డిసెంబర్ 2న తెలంగాణ సొసైటీస్ రిజిస్ట్రేషన్ చట్టం–2001 ప్రకారం 828/2024 నంబరుతో నమోదైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిటీ అధ్యక్షుడిగా ఇలాపురం నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడిగా గుణగుర్తి లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా రాచర్ల సందీప్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా ఆలకుంట్ల శంకరయ్య, కోశాధికారిగా భవాని శంకర్ బొక్కిస వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.సొసైటీకి సంబంధించిన బ్యాంకు స్టేట్‌మెంట్లు, యూపీఐ లావాదేవీలు, క్యాష్‌బుక్, లెడ్జర్, బిల్లులు, వోచర్లు, కమిటీ సమావేశాల తీర్మానాలు, జనరల్ బాడీ రికార్డులు, ఆడిట్ నివేదికలను పరిశీలించాలని సంబంధిత రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేసినట్లు మాధవ్ తెలిపారు. గోపురం నిర్మాణం కోసం తాను అందించిన రూ.1,11,999 వినియోగంపై ప్రత్యేక విచారణ జరపాలని, అన్ని భౌతిక, ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరచాలని కోరారు. ఏవైనా ఆర్థిక అవకతవకలు లేదా చట్ట ఉల్లంఘనలు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులమాల్సిన అవసరం లేదని, ఆలయానికి వచ్చిన విరాళాలు, దాతల సొమ్ము వినియోగం, ఆర్థిక పారదర్శకతకు సంబంధించిన అంశంగానే దీనిని చూడాలని మాధవ్ స్పష్టం చేశారు. భక్తులు తమ కష్టార్జిత సంపాదన నుంచి ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు అందిస్తారని, ఆ నిధుల వినియోగంపై స్పష్టమైన లెక్కలు వెల్లడించడం కమిటీ బాధ్యత అని పేర్కొన్నారు. తాను వ్యక్తిగత ప్రయోజనం కోసం కాకుండా ఆలయానికి విరాళాలు అందించిన ప్రతి దాతకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.దేవుడి పేరుతో వచ్చిన ప్రతి రూపాయికి లెక్క ఉండాలి.. దాతల నమ్మకానికి న్యాయం జరగాలి అని ప్రతిపతి మాధవ్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపడతారా? ఆలయ విరాళాల వినియోగంపై స్పష్టత ఇస్తారా? అన్నది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :