Monday, 09 November 2026 02:51:19 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

జిన్నారంలో పోచమ్మ దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రూ.12 లక్షల విరాళం

Date : 24 August 2026 01:29 PM Views : 77

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజాసేవతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తూ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) ముందుకు సాగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిన్నారం మున్సిపల్ కేంద్రంలో మాల సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రూ.12 లక్షల భారీ విరాళాన్ని అందించారు.సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామ ప్రజలతో కలిసి ఆలయ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులకు రూ.12 లక్షల నగదును అందజేశారు. ఈ నెల 30న నిర్వహించనున్న ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కమిటీ సభ్యులకు సూచించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దైవభక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజాసేవను తన బాధ్యతగా భావిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా ప్రజలను ఐక్యం చేసే సామాజిక వేదికలని పేర్కొన్నారు. ఇదే ఉద్దేశంతో నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 200కు పైగా దేవాలయాలు, మసీదులు, ఆశూర్ఖానాలు, చర్చిల నిర్మాణానికి సహకరించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే జిఎంఆర్ అందిస్తున్న సేవలు అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, గుమ్మడిదల మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :