ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కళ్యాణ లక్ష్మి పథకం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పటాన్‌చెరులో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ మేట్టు కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డితో కలిసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.2014 అక్టోబర్ 2న ప్రారంభమైన కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. తొలుత రూ.51 వేలుగా ఉన్న సహాయాన్ని 2017లో రూ.75,116కు, 2018లో రూ.1,00,116కు పెంచినట్లు నాయకులు గుర్తుచేశారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణ లక్ష్మి కింద అందుతున్న రూ.1,00,116కు అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే అమల్లో ఉన్న పథకాన్ని కూడా సక్రమంగా కొనసాగించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచే కళ్యాణ లక్ష్మి పథకాన్ని మరింత బలోపేతం చేయాలని కోరారు.కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు