ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి: రోడ్డు ప్రమాదానికి కారణమైన వాహనదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. వివరాల ప్రకారం.. ఈ నెల 25వ తేదీన మధ్యాహ్నం సమయంలో రహదారిపై వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఫిర్యాదుదారుడి వివరాల ప్రకారం, TS15EF 2266 నంబర్ గల వాహనం, TS08UF 1075 నంబర్ గల ట్రాలీ ఆటోకు సంబంధించిన ఘటనలో నష్టం జరిగినట్లు తెలిపారు. ప్రమాదం అనంతరం సంబంధిత వ్యక్తులు అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా, స్థానికుల సహాయంతో వారిని గుర్తించినట్లు పేర్కొన్నారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని బాధితుడు కోరారు. ప్రమాదానికి గల కారణాలు, వాహనాల పత్రాలు, డ్రైవర్ల వివరాలపై పోలీసులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Admin
ప్రజా పిలుపు