ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తడిగుడ్డతో గొంతు కోసే మనస్తత్వమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.శనివారం నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమంలో కాగజ్ మద్దూర్, నస్తాయిపల్లి, గూడెంగడ్డ, కొండాపూర్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు, సునీతా రెడ్డి కండువాలు కప్పి ఆహ్వానించారు.హరీష్ రావు మాట్లాడుతూ...* మూడేళ్లయినా 6 గ్యారెంటీలను అమలు చేయలేదు. పింఛన్లు పెంచుతామని మోసం చేశారు. ఎల్ నినో పై శాస్త్రవేత్తలు 6 నెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించింది. - బీఆర్ఎస్ హయాంలో యాసంగిలోనూ 24 గంటల కరెంటు ఇస్తే, ఇప్పుడు వానాకాలంలోనూ 6-7 గంటలు ఇవ్వడం లేదు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మనుషులు లేని ఫ్యూచర్ సిటీకి కోట్లతో 6 లైన్ల రోడ్లు వేస్తూ, జనం ఉన్న గ్రామాల రోడ్లను గుంతలమయంగా వదిలేశారు.ప్రజలు కాంగ్రెస్ పట్ల విసుగు చెంది మళ్లీ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారని అన్నారు.ఎమ్మెల్యే సునీతా రెడ్డి మాట్లాడుతూ ఇతర పార్టీల నుంచి వలసలు పెరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.కార్యక్రమంలో మాజీ లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బాబ్యా నాయక్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యాషుడు పంబాల బిక్షపతి, కౌన్సిలర్లు బాల్ రెడ్డి, బుల్లెట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు