Friday, 25 September 2026 03:31:27 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

వినాయక నిమజ్జనంలో విషాదం.. ఆరుగురు విద్యార్థులు మృతి

Date : 16 September 2026 09:44 PM Views : 156

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం, సెప్టెంబర్ 16: వినాయక నిమజ్జనం సందర్భంగా సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం శివానగర్ పరిధిలోని నేరేడు చెరువులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శివానగర్‌లోని శిరీష ట్రస్ట్‌కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువులోకి దిగగా.. విగ్రహం అదుపుతప్పి వారిపై పడటంతో ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మృతి చెందారు.శిరీష ట్రస్ట్‌లో సింగిల్ పేరెంట్ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ట్రస్ట్‌లో విగ్రహాన్ని ప్రతిష్ఠించి, మూడో రోజు నిమజ్జనం చేసేందుకు విద్యార్థులు, నిర్వాహకులు నేరేడు చెరువు వద్దకు వెళ్లారు.నిమజ్జనం కోసం ఎనిమిది మంది విద్యార్థులు చెరువులోకి దిగారు. లోతైన ప్రాంతానికి వెళ్లవద్దని ఒడ్డున ఉన్న పెద్దలు హెచ్చరించినప్పటికీ, విగ్రహాన్ని లోతైన ప్రాంతంలో నిమజ్జనం చేసేందుకు వారు ముందుకు వెళ్లారు. ఈ క్రమంలో విగ్రహం అదుపుతప్పి విద్యార్థులపై పడటంతో ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు సురక్షితంగా బయటపడగా, ఆరుగురు నీటిలో మునిగిపోయారు.వెంటనే అప్రమత్తమైన స్థానికులు, నిర్వాహకులు నీటిలోకి దిగి విద్యార్థులను బయటకు తీసి పటాన్‌చెరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఆరుగురు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.మృతులను నరసింహ, రాజు, సుమంత్, ఉదయ్ కిరణ్, శ్యాం కుమార్, సిద్ధార్థ్గా గుర్తించారు.ఘటన విషయం తెలుసుకున్న డీసీపీ శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి, ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ కూడా ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు.పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సైతం ఆసుపత్రికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్టుమార్టం ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు సూచించారు.ఒకేసారి ఆరుగురు విద్యార్థులు మృతి చెందడంతో శిరీష ట్రస్ట్‌తో పాటు శివానగర్ పరిసరాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :