ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెల్లాపూర్: పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్ డివిజన్ పరిధి ఉస్మాన్ నగర్‌లో గాలి పోచమ్మ అమ్మవారి ఫలహారం బండి ఊరేగింపు వేడుకలు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు పర్శ శ్యామ్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.మహిళలు బోనాలతో అమ్మవారికి మొక్కులు చెల్లించగా, పోతరాజుల విన్యాసాలు, డప్పు సప్పుళ్లు, కళాకారుల ఆటపాటలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు పర్శ శ్యామ్ రావు ఉత్సాహంగా నృత్యం చేస్తూ భక్తులను అలరించారు. దేవతామూర్తుల వేషధారణలో కళాకారుల ప్రదర్శనలు సైతం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పర్శ శ్యామ్ రావు మాట్లాడుతూ.. సుమారు 70 ఏళ్ల క్రితం గ్రామ పెద్దలు ఒక చెట్టు కింద గాలి పోచమ్మ అమ్మవారిని ప్రతిష్ఠించారని తెలిపారు. అప్పటి నుంచి అమ్మవారు ఉస్మాన్ నగర్ గ్రామస్థుల ఇలవేల్పుగా, భక్తుల కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారని పేర్కొన్నారు. కోరిన కోరికలు తీర్చే దైవంగా అమ్మవారిపై భక్తులకు అపారమైన విశ్వాసం ఉందన్నారు.గత తొమ్మిదేళ్లుగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, తాను ఉన్నంతకాలం మరింత వైభవంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని శ్యామ్ రావు తెలిపారు. ఉత్సవాలకు హాజరైన భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గ్రామస్తులు, భక్తుల సహకారంతో ప్రతి ఏటా ఈ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు కల్పన రామ్ మోహన్ రెడ్డి, కల్పన శ్రీనివాస్, రామేశ్వర్ రావు, మాజీ ఉపసర్పంచ్ కావలి రాములు, మాజీ వార్డు సభ్యులు పెంటయ్య, శ్రీలత విష్ణు, కమలమ్మ, బాలరాజు, కుమార్, రవీందర్ రెడ్డి, వినోద్, రాములు, సత్తి రెడ్డి, నర్సింగ్ రావు, నరసింహ, శేఖర్, మల్లేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.మహిళల బోనాలు.పోతరాజుల విన్యాసాలు.. శ్యామ్ రావు నృత్యం ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి.
Admin
ప్రజా పిలుపు