ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఈ నెల 19వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.అతని ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల వద్ద విచారించినప్పటికీ సమాచారం లభించలేదు. సంబంధిత వ్యక్తికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మరింత ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు.అదృశ్యమైన వ్యక్తి ఆచూకీ తెలిసిన వారు 9550386793 నంబర్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
Admin
ప్రజా పిలుపు