ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పాలిటెక్నిక్ కళాశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు కల్పించాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని కోరారు.పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీఆర్ఎస్‌వీ నేతలు చెన్నారెడ్డి, మీరాజ్ ఖాన్, రాష్ట్ర అధ్యక్షురాలు మనీషా ఆధ్వర్యంలో పటాన్‌చెరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విద్యార్థుల తరఫున అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్‌వీ నేతలు మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రత్యేక ప్రోత్సాహం అందించాలని కోరారు. పరీక్షలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, భవిష్యత్ ఉపాధి అవకాశాలకు సంబంధించి విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.మన పాలిటెక్నిక్–మన హక్కు.. మన సాంకేతిక విద్య–మన భవిష్యత్తు” అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులు తమ డిమాండ్లను వెల్లడించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తమ డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వెంటనే పరిష్కరించాలని వారు కోరారు.
Admin
ప్రజా పిలుపు