ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గురుపూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో గురుభక్తి, సంస్కారం, విలువలను పెంపొందించే లక్ష్యంతో పటాన్‌చెరు మండలం ముత్తంగి గ్రామంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో గురుపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా భారతీయ సనాతనసంప్రదాయమైన "ఆచార్య దేవో భవ" భావనను ప్రతిబింబిస్తూ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. విద్యార్థులకు జ్ఞానం, క్రమశిక్షణ, సంస్కారంతో కూడిన విద్యను అందించడమే విద్యాసంస్థ లక్ష్యమని ప్రధానోపాధ్యాయుడు సి.హెచ్. రాజేష్ తెలిపారు.అనంతరం తోటి ఉపాధ్యాయులను సన్మానించి గురుపూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని గురుపూర్ణిమ ప్రాముఖ్యతను వివరించారు.
Admin
ప్రజా పిలుపు