ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : ,, జిల్లాలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై పైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కె.హైమావతి హెచ్చరించారు.ఇటీవల చేర్యాల మండలంలో శ్రీసాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్ లో యూరియా సరఫరా లో కొంత అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి రావడం జరిగిందని వెంటనే జిల్లా వ్యవసాయ అధికారి ద్వారా ఎంక్వయిరీ చేసినప్పుడు ప్రాథమిక ఎంక్వయిరీ రిపోర్టులో శ్రీ సాయి శివ ఫెర్టిలైజర్ సేల్స్ షాప్ అతను సందీప్ రెడ్డి ఈ పాస్ మిషన్ ద్వారా హోల్సేల్ డీలర్స్ నుంచి 6429 బ్యాగుల యూరియాని తీసుకొని దానిని కన్ఫర్మేషన్ చేయకుండా అక్రమంగా ఇతనే రైతుల పేర్లను రైతుల ఆధార్ కార్డు ఆధారంగా తీసుకొని సేల్ చేసినట్టు చూపించి అక్రమాలకు పాల్పడినట్టు తెలిసిందని అన్నారు. ఈ విధంగా యూరియాను మిస్ యు చేశారు.కాబట్టి ఇతనిపై వెంటనే ఎంక్వయిరీ చేసి పోలీస్ కేసు నమోదు చేయడంతో వెంటనే అతన్ని పోలీసులు అరెస్టు చేశారన్నారు. అలాగే అతని లైసెన్సును కూడా వ్యవసాయ శాఖ రద్దు చేసిందని తెలిపారు. సిద్దిపేట అర్బన్ మండలంలోని శ్రీఆంజనేయ ఫర్టిలైజర్స్, శ్రీగణేష్ ట్రేడర్స్ హోల్ సేల్ డీలర్ల నుండి ఇతనికి యూరియా బ్యాగులను సప్లై చేయడం జరిగిందని, ప్రాథమిక విచారణలో వీరు సప్లై చేసిన యూరియా మిస్ యూస్ అయింది కాబట్టి,ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడంతో ఈ రెండు షాపులు శ్రీ ఆంజనేయ ఫెర్టిలైజర్స్,, శ్రీగణేష్ ట్రేడర్స్ ల లైసెన్స్ లను వ్యవసాయ శాఖ డైరెక్టర్ రద్దు చేశారని తెలిపారు.అదేవిధంగా యూరియా డైవర్షన్ జరుగుతున్న, అక్రమాలు జరుగుతున్న చేర్యాల మండల వ్యవసాయ అధికారి భోగేశ్వర్ స్వామి పర్యవేక్షణ చేయకపోవడం మూలంగా వెంటనే అతని విధుల్లో నుంచి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు.ఈ యూరియా మిస్ యూస్ సంఘటనలో ప్రమేయం ఉన్న ఇతరుల గురించి కూడా ఎంక్వయిరీ చేస్తున్నామని గుర్తించిన తర్వాత వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.యూరియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి రైతులకు సబ్సిడీతో పంపిణీ చేసేందుకు వస్తుందని, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ప్రకారం యూరియా అక్రమ సరఫరాకు ఎవరు పాల్పడిన, యూరియా అక్రమాలకు పాల్పడిన వారి పైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని జిల్లాలో ఎలాంటి యూరియా అక్రమాలకు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.గత రబీ సీజన్ నుండి యూరియా ఆప్ ను అప్ ఉపయోగించడం మూలంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు యూరియాని సరఫరా చేయడం జరిగిందని అన్నారు. రబీ సీజన్ కు సంబంధించి పంట కాలం పూర్తి కావడంతో ఏప్రిల్, మే, జూన్ నెలలలో యూరియా యాప్ ను రాష్ట్ర ప్రభుత్వం క్లోజ్ చేసి యూరియా సేల్స్ ను నిలిపివేసిందని చెప్పారు. కానీ చేర్యాల పట్టణానికి చెందిన శ్రీ సాయి శివ ఫర్టిలైజర్స్ వారు కేంద్ర ప్రభుత్వ ఈ పాస్ పరికరం ను ఉపయోగించి ఇష్ట రాజ్యాంగ రైతుల పేర్లు అక్రమంగా నమోదు చేస్తూ యూరియా అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. (ఈ పాస్ పరికరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది దీన్ని ఎప్పుడు క్లోజ్ చేయరు. దీని అవకాశంగా తీసుకొని యూరియా అక్రమాలకు పాల్పడ్డారు)యూరియా యాప్‌ను ఉపయోగించడం ద్వారా ఎలాంటి డైవర్షన్ జరగకుండా నియంత్రించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూరియా యాప్ ద్వారానే సేల్ చేయాలని, యూరియా యాప్‌ను మాత్రమే ఉపయోగించాలని, వేరే ఏ విధానాన్ని ఉపయోగించినా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
Admin
ప్రజా పిలుపు