Thursday, 24 September 2026 11:35:18 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

రాహుల్ గాంధీపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించాలి:కాట సుధా శ్రీనివాస్ గౌడ్*:

Date : 01 September 2026 04:20 PM Views : 146

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ** :కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.రాహుల్ గాంధీపై కేసు నమోదు చేయడాన్ని నిరసిస్తూ బండలగూడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీకి మద్దతుగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజల హక్కుల కోసం ప్రశ్నించే గొంతును అణచివేయడానికి కేసులను ఉపయోగించడం సరికాదని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపై నమోదు చేసిన కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్య హక్కులు, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని కాట సుధా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :