Friday, 25 September 2026 01:26:34 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

మానవత్వం చాటుకున్న 1993 పూర్వ విద్యార్థులు*

దివంగత మిత్రుడు యాదయ్య యాదవ్ కుమార్తెకు 1993 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

Date : 10 July 2026 08:41 PM Views : 147

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్ చేరు పట్టణములో 1993 సంవత్సరం విద్యార్థులు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థి, ఎల్‌ఎల్‌బి మిత్రుడు గోకుల్ నగర్ నివాసి యాదయ్య యాదవ్ కొన్ని నెలల క్రితం అకాల మరణం చెందడం పట్ల వారి బ్యాచ్ మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం యాదయ్య యాదవ్ కుమార్తె ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. అయితే, తండ్రి మరణంతో ఆమె కాలేజీ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం మిత్రుల దృష్టికి వచ్చింది.ఈ నేపథ్యంలో, ఆమె విద్యాభ్యాసానికి ఎటువంటి అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో 1993 బ్యాచ్ పూర్వ విద్యార్థులంతా ఒకటై మానవత్వాన్ని చాటుకున్నారు. అందరూ కలిసి రూ. 80,000 ఆర్థిక సహాయాన్ని సేకరించి శుక్రవారం బాధిత కుటుంబానికి అందజేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ... ఆపదలో ఉన్న మిత్రుడి కుటుంబానికి అండగా నిలవడం తమ బాధ్యతని, ఈ ఆర్థిక సహాయం ద్వారా ఆమె చదువు పూర్తి చేసుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. యాదయ్య యాదవ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లోనూ ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1993 బ్యాచ్‌కు చెందిన పలువురు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :