Saturday, 26 September 2026 11:23:43 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

బీరంగూడ గుట్ట ఆలయంలో హరితహారం.. 5,200 మొక్కలు నాటనున్న వెల్స్ ఫార్గో

పర్యావరణ పరిరక్షణకు కార్పొరేట్ సంస్థల చేయూత అభినందనీయం: ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్

Date : 03 July 2026 07:42 PM Views : 149

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : బీరంగూడ, ప్రకృతి సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావడం సమాజానికి సానుకూల సంకేతమని బీరంగూడ గుట్టలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. ప్రముఖ కార్పొరేట్ సంస్థ వెల్స్ ఫార్గో దేవాలయ ప్రాంగణంలో 5,200 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల మొక్కలను నాటారు. ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్, కార్యనిర్వహణ అధికారి దేవనాదం సమక్షంలో వెల్స్ ఫార్గో ప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ, ఆలయ పరిసరాలను పచ్చదనంతో నింపే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. దేవాలయం తరఫున నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, అవి పెద్ద వృక్షాలుగా ఎదిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు అవసరమని, మరిన్ని సంస్థలు కూడా సామాజిక బాధ్యతలో భాగంగా ముందుకు రావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ సభ్యులు, ఆలయ అర్చకులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు, వెల్స్ ఫార్గో సంస్థ ప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలను హరితవనంగా తీర్చిదిద్దే ఈ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :