Monday, 09 November 2026 02:53:04 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

వనమహోత్సవం లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలి: మంత్రి కొండా సురేఖ

Date : 24 August 2026 07:15 PM Views : 89

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం-2026లో జిల్లాలకు కేటాయించిన మొక్కలు నాటే లక్ష్యాలను నిర్దేశిత గడువులోగా నూరు శాతం పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.సోమవారం డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వినయ్ కుమార్‌తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అటవీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వనమహోత్సవం-2026లో లక్ష్యసాధన, మొక్కల నాటకం, వాటి సంరక్షణ తదితర అంశాలపై సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భావితరాలకు సమతుల్యమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వం వనమహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 56 శాతం మొక్కలు నాటే లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాలను సెప్టెంబర్ చివరి వారం నాటికి నూరు శాతం పూర్తి చేయాలని సూచించారు.వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో లక్ష్యాలను సాధించలేకపోయామని, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మంత్రి అన్నారు. అటవీ శాఖ నర్సరీల్లో తగినన్ని మొక్కలు అందుబాటులో ఉన్నందున, ఆయా ప్రాంతాలకు అనుగుణంగా సరైన జాతుల మొక్కలను ఎంపిక చేసి నాటాలని అధికారులకు సూచించారు.మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్క జీవించేలా చర్యలు చేపట్టాలని, పశువులు, జంతువుల నుంచి మొక్కలను రక్షించేందుకు అవసరమైన ప్రాంతాల్లో ట్రీగార్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని, మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ప్రతి ఇంటికీ మొక్కలను పంపిణీ చేయాలని సూచించారు. దేవాలయాల ప్రాంగణాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన మొక్కలను నాటేలా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టాలని తెలిపారు. వనమహోత్సవం లక్ష్యాల సాధనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని మంత్రి సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ కె. హైమావతి, డీఆర్‌డీఓ రమేష్, డీపీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :