ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాటయోధుడని జిల్లా కలెక్టర్ కె. హైమావతి అన్నారు. సబ్బండ వర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.మంగళవారం సిద్దిపేట పట్టణంలోని ఎన్సాన్‌పల్లి వెళ్లే మార్గంలోని చౌరస్తాలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని అన్నారు. నాటి కాలంలో అన్ని వర్గాల ప్రజలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేయాలనే ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఆయన సాగించిన పోరాటం గొప్పదని పేర్కొన్నారు.విశ్వ కీర్తి పొందిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్పతనాన్ని స్మరించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి సయ్యద్ రఫీ, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, గౌడ సంఘ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు