Friday, 25 September 2026 11:20:51 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

యూజీసీ-నెట్ పరీక్షకు 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు*

Date : 08 September 2026 05:14 PM Views : 45

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : * కేంద్రంలోని ఇందూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, పొన్నాల గ్రామంలో సెప్టెంబర్ 9, 10 తేదీల్లో నిర్వహించనున్న జాతీయ అర్హత పరీక్ష (యూజీసీ-నెట్)ను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు భారతీయ నాగరిక సురక్షాసంహిత–2023లోని సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు.పరీక్షా కేంద్రంలో భద్రతా ఏర్పాట్లతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె పేర్కొన్నారు. పరీక్ష సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా, పరీక్ష నిర్వహణలో ఎవరూ ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకోకుండా ఉండేందుకు ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడడం నిషేధం. అలాగే కర్రలు, కత్తులు, ఆయుధాలు, లాఠీలు లేదా ఇతర హానికరమైన పరికరాలను తీసుకురావడం, ప్రదర్శించడం పూర్తిగా నిషేధించినట్లు కలెక్టర్ తెలిపారు.అదేవిధంగా పరీక్షా కేంద్రానికి 200 మీటర్ల పరిధిలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు, ఇంటర్నెట్ కేంద్రాలు, సైబర్ కేఫ్‌లు తదితరాలను పరీక్ష జరిగే రెండు రోజుల్లో మూసివేయాలని ఆదేశించారు.ఈ ఆంక్షలు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు లేదా పరీక్ష పూర్తయ్యే వరకు అమల్లో ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.పరీక్షా నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలు, విద్యార్థులు, స్థానికులు అధికారులకు సహకరించాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :