Friday, 25 September 2026 12:21:25 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

నర్సాపూర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

విగ్రహానికి ఘన నివాళులు అర్పించిన గౌడ సంఘం నాయకులు

Date : 18 August 2026 12:43 PM Views : 84

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : * సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా నర్సాపూర్ పట్టణంలో ఆయన విగ్రహానికి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. విగ్రహ వ్యవస్థాపకులు, బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ చరిత్రలో ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన మహనీయుడని కొనియాడారు. ఔరంగజేబు పాలనకు, దొరల అరాచకాలకు, మొగలాయిల దౌర్జన్యాలకు ఎదురొడ్డి తెలంగాణ ప్రాంతంలో అణగారిన వర్గాల కోసం పోరాడిన ధీశాలి అని అన్నారు. బహుజన రాజ్యాధికారం, సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు.ధైర్యం, ఆత్మగౌరవం, ప్రజా సంక్షేమం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చూపిన మార్గాన్ని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే పాపన్న గౌడ్‌కు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, జిల్లా పరిషత్ సభ్యురాలు సుహాసిని, నర్సాపూర్ గౌడ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకులు చిన్న రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, శ్యామ్ సుందర్ గౌడ్, కౌన్సిలర్లు ఆంజనేయులు గౌడ్, రిజ్వాన్, శ్రీశైలం, రాధాకృష్ణ, నరేష్ గౌడ్, బీజేపీ నాయకులు ఆంజనేయులు గౌడ్, రామకృష్ణ గౌడ్, ఫారెస్ట్ బిక్షపతి గౌడ్ తదితర గౌడ సంఘం నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :