Monday, 10 August 2026 07:56:42 AM
# నాగార్జునసాగర్‌లో ఈ నెల 10న వరుణ యాగం* # ఆగస్టు 10 వ తేదీ ప్రజా వాణి రద్దు* # రుద్రారం బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళకు తీవ్ర గాయాలు # తిరుపతి శ్రీవారిని దర్శించుకున్న ఆదర్శ్ రెడ్డి # *ప్రశాంత వాతావరణంలో బోనాలు, ఫలహారం బండి ఊరేగింపులు నిర్వహించాలి* # *ప్రశాంత వాతావరణంలో బోనాల పండుగ నిర్వహించాలి* # తంగళ్లపల్లిలో ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు # స్కూల్ సమీపంలోని చెరువులో పడి బాలుడు మృతి # ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి వేడుకలు # పటాన్ చెరు లో కాంగ్రెస్ వైఫల్యాలపై టీఆర్ఎస్ నేతల సమరభేరి: తుమ్మల చంద్రశేఖర్ రెడ్డి ఘాటు విమర్శలు!* # సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి # *కొడకంచి భూ బాధిత రైతులకు న్యాయం చేయాలి* # నిలోఫర్ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం, వైద్య సేవలపై రోగుల బంధువుల ఆందోళన # టీజీ మోడల్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం # బోనాల తొట్టెల ఊరేగింపునకు చిమ్ముల గోవర్ధన్ రెడ్డికి ఆహ్వానం* # టీడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు మహాసభను విజయవంతం చేయాలి # ఘనంగా సీనియర్ పాత్రికేయులు రాజు జన్మదిన వేడుకలు # నందన్ ప్యారడైజ్ కాలనీలో రూ.67 లక్షల సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన # జగ్గారెడ్డిని కలిసిన సంగారెడ్డి జిల్లా టీజీఓ సంఘం నాయకులు # యువతి అదృశ్యం.. పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు*

నర్సాపూర్‌లో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం*

చేతులు కట్టేసిన స్థితిలో లభ్యం.. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

Date : 17 July 2026 05:09 PM Views : 144

ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమవడంతో స్థానికంగా కలకలం రేగింది. మృతదేహం చేతులు కట్టేసిన స్థితిలో ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, మృతి చెందిన మహిళ వయస్సు సుమారు 35 సంవత్సరాలు ఉండవచ్చని తెలుస్తోంది. గురువారం రాత్రి సమయంలో ఆమె ఆ ప్రాంతంలో తిరుగుతూ కనిపించినట్లు కొందరు స్థానికులు తెలిపారు. శుక్రవారం ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న ఎస్సై రంజిత్ కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటివరకు మృతి చెందిన మహిళ వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు.మహిళ మృతికి గల కారణాలు, హత్య జరిగిందా లేదా అనే అంశాలు పోలీసుల దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. స్థానికులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :