ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: హైదరాబాద్ తొలి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ 113వ జయంతి వేడుకలను పటాన్‌చెరు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి ముదిరాజ్ సంఘం పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో హాజరై కృష్ణస్వామి ముదిరాజ్ సేవలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Admin
ప్రజా పిలుపు