ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : ) నర్సాపూర్ పట్టణ సమీపంలోని రాయరావు చెరువులో ఓ యువకుడి మృతదేహం శుక్రవారం నీటిపై తేలుతూ కనిపించింది. మృతుడిని నర్సాపూర్ పట్టణానికి చెందిన ప్రదీప్‌గా గుర్తించారు.ఆత్మహత్యకు ముందు “Miss you Chintu, Sorry ra” అంటూ సందేశం పంపిన అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ప్రదీప్ ఒక రోజు క్రితమే చెరువులో పడి ఉండవచ్చని, మృతదేహం శుక్రవారం నీటిపైకి తేలినట్లు భావిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
Admin
ప్రజా పిలుపు