ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిన్నారం మున్సిపాలిటీ పరిధిలోని సోలక్పల్లి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం కురిసిన మోస్తరు వర్షం రైతులకు తీవ్ర ఆవేదన మిగిల్చింది. అకాల వర్షానికి గ్రామానికి చెందిన ముగ్గురు రైతుల ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. పంట చేతికి వచ్చిన సమయంలో వర్షం కురవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంట వర్షార్పణం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వరి కోతలు పూర్తిచేసి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్న సమయంలో వర్షం కురవడంతో ధాన్యం తడిసి ముద్దయిందని వాపోయారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని సైతం ఎలాంటి నిబంధనల పేరుతో తిరస్కరించకుండా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలు రైతన్నల పాలిట శాపంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నష్టపోయిన రైతులకు తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు