Friday, 25 September 2026 05:29:52 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

Date : 18 August 2026 07:07 PM Views : 84

ప్రజా పిలుపు / తెలంగాణ / సిద్దిపేట : రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా అధికారులు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు.భూగర్భ జలాల లభ్యతను దృష్టిలో ఉంచుకుని వరి సాగును నియంత్రించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఎల్‌నినో ప్రభావంతో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాల్సిన సమయంలో జిల్లాలో వరి సాగు కొనసాగుతున్న ప్రాంతాలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి అంతంతమాత్రంగానే ఉందని, రైతులు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇకపై వరి సాగు చేయకుండా ముందస్తుగా అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామపంచాయతీల పరిధిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.వాల్టా చట్టానికి విరుద్ధంగా ఏర్పాటు చేసిన బోర్లను గుర్తించి వెంటనే తొలగించాలని, బోరు బావుల ద్వారా వరి సాగు చేయకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.రబీ సీజన్‌లో ప్రధానంగా భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుందని, ప్రస్తుతం నీటిని అధికంగా వినియోగిస్తే రానున్న రోజుల్లో తీవ్ర నీటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు వరి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, ఇప్పటికే జిల్లాలో సరిపడా ధాన్యం అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు.ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. బుధవారం నుంచి జిల్లాలో గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు.జిల్లాలోని రిజర్వాయర్లలో ప్రస్తుతం ఉన్న నీటిని ప్రధానంగా తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాల్సిన పరిస్థితి ఉందన్నారు. జిల్లాలో ఎక్కడ వరి సాగు చేపడితే అక్కడి సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరి సాగు జరగకుండా వెంటనే ప్యాడీ సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు.యూరియా పక్కదారి పట్టినట్లు తేలితే సంబంధిత అధికారులపై కూడా నేరపూరిత కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మండలాల వారీగా చేరుకున్న విత్తనాల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. రైతులతో సమావేశాలు నిర్వహించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా అవగాహన కల్పించాలని, అవసరమైన విత్తనాలను వెంటనే తెప్పించాలని సూచించారు.రైతులు పండించిన ప్రతి పంటను భారత ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. ప్రతి పొలంలో 8 నుంచి 12 పరిమాణంలో వ్యవసాయ కుంటలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఆయిల్‌పామ్ సాగును నిర్దేశిత లక్ష్యం మేరకు చేపట్టాలని, జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు వెనుకబడి ఉన్నందున పురోగతి సాధించాలని సూచించారు. బిందు సేద్యం, ఇతర అవసరమైన పరికరాల పంపిణీ లక్ష్యాలను కూడా సాధించాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, వ్యవసాయ శాఖ అధికారి మల్లయ్యతో పాటు క్షేత్రస్థాయి ఉద్యానవన, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :