Sunday, 08 November 2026 06:47:18 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

గరుడ జూనియర్ కళాశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం

Date : 18 September 2026 07:23 PM Views : 54

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్పూర్: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి ఆధ్వర్యంలో అమీన్‌పూర్‌లోని గరుడ జూనియర్ కళాశాలలో శుక్రవారం న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు వివిధ చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టపరమైన రక్షణలు మరియు బాధ్యతల గురించి తెలుసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగవచ్చని పేర్కొన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తున్నట్లు, ఆర్థికంగా వెనుకబడిన వారు, మహిళలు, పిల్లలు, వృద్ధులు మరియు ఇతర అర్హులైన వ్యక్తులు ఈ సేవలను వినియోగించుకోవచ్చని వివరించారు.అలాగే లోక్ అదాలత్‌ల ద్వారా కేసులను స్నేహపూర్వకంగా పరిష్కరించుకోవడం, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం, న్యాయ సేవాధికార సంస్థల సేవలు మరియు న్యాయ అవగాహన కార్యక్రమాల ప్రాధాన్యత గురించి విద్యార్థులకు వివరించారు.విద్యార్థులు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వినియోగం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలియని లింకులు, OTPలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని, సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.మహిళలు, బాలల రక్షణకు సంబంధించిన చట్టాలు, బాల్య వివాహాల నిరోధం, బాలల హక్కులు, మహిళలపై హింస నివారణ వంటి అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఏదైనా సమస్య ఎదురైనప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన మరియు బాధ్యతాయుతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.అమీన్‌పూర్ ఎస్‌.ఐ. ప్రభాకర్ విద్యార్థులకు పోలీస్ శాఖ సేవలు, చట్టపరమైన నిబంధనలు, నేరాల నివారణలో విద్యార్థుల పాత్ర గురించి వివరించారు. విద్యార్థులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండి, ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపించినప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.న్యాయవాది మాణిక్ యాదవ్ విద్యార్థులకు న్యాయపరమైన అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను అడిగి తెలుసుకొని, చట్టంపై ప్రాథమిక అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గరుడ జూనియర్ కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :