ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ఈదుల నాగులపల్లి గ్రామానికి చెందిన మల్కాపూరం సువర్ణ (51) అనే మహిళ అదృశ్యమైనట్లు భానూర్ పోలీసులు తెలిపారు.ఈ నెల 8వ తేదీ రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా సువర్ణ ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్ల వద్ద వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు.సువర్ణ ఇంటి నుంచి వెళ్లే సమయంలో చాక్లెట్ రంగు చీర, జాకెట్ ధరించి ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఎత్తు సుమారు 4.5 అడుగులు, చామనచాయ రంగు కలిగి ఉంటుందని పోలీసులు వివరించారు.ఈ ఘటనపై భానూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సువర్ణ ఆచూకీ తెలిసిన వారు వెంటనే కింది ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.భానూర్ పోలీస్ స్టేషన్: 8712661840ఎ. శ్రీనివాస్ రెడ్డి, ఎస్‌ఐపీ: 8712581182 భానూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ: 8712656727
Admin
ప్రజా పిలుపు