Monday, 09 November 2026 03:18:38 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 3వ జాతీయ లోక్‌అదాలత్

సెప్టెంబర్ 12న ఐదు కోర్టు ప్రాంగణాల్లో నిర్వహణ

Date : 09 September 2026 07:23 PM Views : 78

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : సంగారెడ్డి, సెప్టెంబర్ 9: సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను ఈ నెల 12న సంగారెడ్డి జిల్లా కోర్టుతో పాటు జహీరాబాద్, జోగిపేట, నారాయణఖేడ్, జిన్నారం కోర్టు ప్రాంగణాల్లో నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సెషన్స్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి జి. భవానీ చంద్ర తెలిపారు.జాతీయ లోక్‌అదాలత్‌ ద్వారా వివిధ రకాల సివిల్, క్రిమినల్, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంకింగ్ తదితర రాజీ పడదగిన కేసులను ఇరుపక్షాల పరస్పర అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆమె తెలిపారు.లోక్‌అదాలత్‌ ద్వారా కేసులు పరిష్కరించుకోవడం వల్ల సమయం, ఖర్చు ఆదా కావడంతో పాటు ఇరుపక్షాల మధ్య సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. అలాగే కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్యను తగ్గించేందుకు లోక్‌అదాలత్‌లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు.సెప్టెంబర్ 12న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌లో అత్యధిక సంఖ్యలో కేసులను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని న్యాయాధికారులు, న్యాయవాదులు, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులను ఆమె కోరారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులతో పాటు ప్రీ-లిటిగేషన్ దశలో ఉన్న వివాదాలను కూడా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకునేందుకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ప్రజలు తమ కేసుల పరిష్కారం కోసం సంబంధిత కోర్టు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేదా తాలూకా న్యాయ సేవా కమిటీని సంప్రదించి, లోక్‌అదాలత్‌ ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలని జి. భవానీ చంద్ర పిలుపునిచ్చారు.రాజీ మార్గమే ఉత్తమ మార్గం – లోక్‌అదాలత్ ద్వారా త్వరితగతిన న్యాయం” అనే లక్ష్యంతో నిర్వహిస్తున్న 3వ జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయడానికి అన్ని వర్గాలు సహకరించాలని ఆమె కోరారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :