Friday, 25 September 2026 02:24:02 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

అనుమానాస్పద స్థితిలో మహిళ హత్య

ఓ ఆర్ ఆర్ సర్వీస్. పై మృతదేహం లభ్యం – తలకు తీవ్ర గాయాలు – దర్యాప్తు ముమ్మరం

Date : 16 July 2026 03:00 PM Views : 180

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డుకు సమీపంలోని చెట్ల ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉన్నట్లు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పటాన్‌చెరు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో మృతురాలిని సదాశివపేటకు చెందిన 40 ఏళ్ల మంజులగా గుర్తించారు. ప్రస్తుతం ఆమె పటాన్‌చెరు పరిధిలోని అంబేద్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.పోలీసుల ప్రాథమిక విచారణలో మృతురాలి తలకు తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను సంఘటన స్థలానికి తీసుకువచ్చి ఇనుపరాడ్లు, కట్టెలతో తలపై దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. మృతురాలు ధరించిన దుస్తులు కూడా చిరిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణుల బృందం పరిశీలించి ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.ఈ కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :