Saturday, 26 September 2026 11:23:50 AM
# అసాంఘిక కార్యకలాపాలపై నర్సాపూర్ పోలీసుల నిఘా # బ్రహ్మోత్సవాల వేళ విద్యుత్ సరఫరా నిలిపివేత # ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందాలి ..అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి .* # బాలాపూర్ లడ్డూ రూ.39 లక్షలకు సొంతం చేసుకున్న సామ ప్రణీత్ రెడ్డి # రూ.4.30 లక్షలకు గణేష్ లడ్డూ వేలం # 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి*

కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? – తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మెట్టు శ్రీధర్

Date : 01 July 2026 12:15 PM Views : 107

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నా, కొత్తగా అర్హత పొందిన వేలాది మంది నిరుపేదలకు ఇప్పటికీ సామాజిక భద్రతా పింఛన్లు మంజూరు కాకపోవడం ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో సామాజిక పింఛన్లను పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. కనీసం కొత్తగా అర్హత పొందిన లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఆ ప్రక్రియ కూడా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని విమర్శించారు. ప్రజాపాలన కార్యక్రమంలో పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటు, "ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక"లో కొత్త పింఛన్ల మంజూరును ప్రస్తావించిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తామని ప్రకటించారని, అనంతరం సంబంధిత మంత్రి జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు అమలు చేస్తామని వెల్లడించినప్పటికీ, జూలై నెల ప్రారంభమైనా అమలుపై స్పష్టత కనిపించడం లేదని అన్నారు.గత కొన్ని సంవత్సరాలుగా సమర్పించిన వేలాది దరఖాస్తులు మండల, మున్సిపల్ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్నాయని, అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర సామాజిక భద్రత అవసరమైన లబ్ధిదారులు తీవ్ర నిరీక్షణలో ఉన్నారని తెలిపారు.రాబోయే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను పరిశీలించి, కొత్త పింఛన్లను వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు పింఛన్ పెంపు అంశంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, కనీసం కొత్తగా అర్హత పొందిన వారికి ఆలస్యం లేకుండా పింఛన్లు మంజూరు చేయడం అత్యవసరమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి నిరుపేదకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని, కొత్త పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :