ప్రజా పిలుపు / తెలంగాణ / Nalgonda : నర్సాపూర్, అక్టోబర్ 22 (ప్రజా పిలుపు): తెలంగాణ పోరాట యోధుడు, తొలి తరం సాయుధ పోరాట వీరుడు పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలను నర్సాపూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన పండుగ సాయన్న చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు పండుగ సాయన్న చేసిన సేవలను, తెలంగాణ ప్రజల కోసం ఆయన సాగించిన ధైర్యసాహసాలతో కూడిన పోరాటాన్ని, చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రమణ రావు, సర్పంచులు ఉదయ్ కుమార్, నరేందర్, శివ కుమార్, నాయకులు తొట్ల ఎల్లయ్య, నాగేష్, బాలరాజు, దుర్గేష్, భాస్కర్, ప్రసాద్, మహేష్, కృష్ణ, దర్శనం, హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు