Friday, 25 September 2026 10:02:27 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి:: ఎంపీ సురేష్ షెట్కర్

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి:: ఎంపీ రఘునందన్ రావు

Date : 24 June 2026 07:11 PM Views : 146

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలి:: ఎంపీ సురేష్ షెట్కర్ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలి:: ఎంపీ రఘునందన్ రావు ప్రజా పిలుపు జూన్ 24: సంగారెడ్డి ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ సూచించారు.బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీ సురేష్ షెట్కర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం నిర్వహించారు. మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావుతో కలిసి కేంద్ర ప్రభుత్వ నిధులతో జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అన్ని అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో చేపడుతున్న పనుల్లో జాప్యాన్ని నివారించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అమృత్ పథకం కింద కొనసాగుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్తగా ఏర్పడిన కోహిర్ మున్సిపాలిటీకి అవసరమైన తాగునీటి కనెక్షన్ల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.రోడ్లు మరియు భవనాల శాఖ, జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో ఆలస్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. పీఎం స్వనిధి పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అవగాహన కల్పించాలని, ప్రతి గ్రామంలో మహిళా సంఘాలకు డ్రోన్లు అందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చెరువుల సుందరీకరణ పనులను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు నారింజవాగు సుందరీకరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులను పారదర్శకంగా, సమర్థవంతంగా వినియోగిస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా చూడాలని అధికారులను కోరారు. జిల్లాలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని సూచించారు.ముత్తంగి నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు జాతీయ రహదారి పనులు ఆలస్యం కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటూ, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. పెద్దాపూర్ రోడ్డు పనులు పెండింగ్‌లో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సంగారెడ్డి–పటాన్‌చెరు మార్గంలో అవసరమైన రహదారి అభివృద్ధి పనులకు సీఆర్ఎఫ్ కింద ప్రతిపాదనలు పంపాలని ఆర్ అండ్ బీ అధికారులకు సూచించారు.పీఎం కుసుం, పీఎం సూర్యఘర్ యోజన పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించి రైతులు, ప్రజలు సౌర విద్యుత్ వినియోగం వైపు ముందుకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కలెక్టరేట్ భవనంలో కూడా సోలార్ వ్యవస్థ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌కు సూచించారు.జిల్లాకు మంజూరైన 12 ఆహార ధాన్య నిల్వ గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి వెంటనే పనులు ప్రారంభించాలని అన్నారు. సంగారెడ్డి- పటాన్చెరు రింగ్ రోడ్డు పరిసర ప్రాంతంలో ఆధునిక చేపల మార్కెట్ ఏర్పాటు కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాలను ముందుగానే గుర్తించి జిల్లా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. నేషనల్ టీబీ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా తండాలలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన చికిత్సలు అందించాలని సూచించారు.జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కార్యాలయాలు, నివాస మరియు వాణిజ్య భవనాలలో పీఎం సూర్యఘర్ యోజన కింద సోలార్ వ్యవస్థల ఏర్పాటుపై విస్తృత అవగాహన కల్పించి ప్రోత్సహిస్తామని చెప్పారు.ఈ సమావేశంలో డీఆర్‌డీఓ జ్యోతి, జిల్లా స్థాయి అధికారులు, జాతీయ రహదారుల సంస్థ ప్రతినిధులు, మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, దిశా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :