ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : * నర్సాపూర్, సెప్టెంబర్ 23(ప్రజా పిలుపు ):నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2025లో నమోదైన టీఎస్ గేమింగ్ చట్టం కేసులో ఇద్దరు నిందితులకు 30 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నర్సాపూర్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బాల్ రెడ్డి తీర్పు వెలువరించారు.దోషులుగా తేలిన అహ్మద్ నగర్ కు చెందిన బేగరి కుమార్, జనకంపేట్ కు చెందిన జక్కుల నర్సింలుకు రిమాండ్ విధించగా, మిగిలిన 8 మందికి ఒక్కొక్కరికి రూ.3 వేల జరిమానా విధించారు.ఈ కేసును ఎస్ఐపి ఎ. రంజిత్ కుమార్ దర్యాప్తు చేయగా, స్టేషన్ రైటర్ బి. సురేష్, కోర్టు కానిస్టేబుల్ హరిబాబు గౌడ్ సహకరించారు.
Admin
ప్రజా పిలుపు