Monday, 09 November 2026 02:52:49 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి*

Date : 18 September 2026 07:10 PM Views : 56

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అమీన్‌పూర్, సెప్టెంబర్ 18: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి బి. సౌజన్య శుక్రవారం అమీన్‌పూర్‌లోని శ్రీవాణి నగర్‌లో ఉన్న నెస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా వృద్ధాశ్రమంలోని వృద్ధులతో ఆమె ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధాశ్రమంలో వారికి అందుతున్న వసతులు, ఆహారం, వైద్య సదుపాయాలు, పరిశుభ్రత, భద్రత, తదితర అంశాలను పరిశీలించారు.వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధుల అవసరాలు, సమస్యలను అడిగి తెలుసుకొని, వారికి అవసరమైన న్యాయపరమైన సహాయం మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉంటుందని తెలిపారు.వృద్ధులను గౌరవించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో వ్యవహరించడం ప్రతి ఒక్కరి బాధ్యతని ఆమె పేర్కొన్నారు. వృద్ధులు తమకు ఎదురయ్యే ఏవైనా న్యాయపరమైన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని, అవసరమైతే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం పొందవచ్చని తెలిపారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు అందుతున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తూ, వారి సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమం నిర్వాహకులు, సిబ్బంది, ఇతరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :