Friday, 25 September 2026 03:30:10 PM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

దళితులను అవమానిస్తే సహించం

ఎర్రవల్లి ఘటనపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆగ్రహం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ క్షమాపణ చెప్పాలి

Date : 11 September 2026 12:41 PM Views : 162

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు,:ఎర్రవల్లి, వరదరాజపూర్ గ్రామాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలో దళితుల నిరసన అనంతరం పసుపు నీళ్లతో శుద్ధి చేసిన ఘటనపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను అవమానించేలా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని, ఇటువంటి ఘటనలు సామాజిక సమానత్వానికి విరుద్ధమని అన్నారు.పటాన్‌చెరు పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నాయకులు మాట్లాడుతూ దళితులను రాక్షస జాతితో పోల్చడం, వారు వచ్చిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం వంటి చర్యలు కుల వివక్షను ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు, చర్యలను సహించేది లేదని స్పష్టం చేశారు.కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకులు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్, దేవానందం, తెల్లాపూర్ మాజీ కౌన్సిలర్ భరత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.నాయకులు మాట్లాడుతూ దేశం అభివృద్ధిలో ముందుకు సాగుతున్న సమయంలో కూడా కుల వివక్ష, అంటరానితనం, కుల అహంకారం వంటి భావజాలం కొనసాగడం బాధాకరమన్నారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, గౌరవం కల్పించిందని గుర్తు చేశారు. ఒక మనిషిని కులం పేరుతో అవమానించడం, ఒక వర్గాన్ని అపవిత్రంగా చిత్రీకరించడం ప్రజాస్వామ్య సమాజానికి తగదన్నారు.ఇటీవల శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలను కూడా నాయకులు ప్రస్తావించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై తాత మధుసూదన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన వ్యవహరించిన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన వేదిక అని, అక్కడ ఉన్నత పదవుల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని సూచించారు.ఎర్రవల్లి ఘటనపై కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్ స్పందించి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంలో కుల వివక్షకు తావులేదని, దళితులను అవమానించే చర్యలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.దళితులకు గతంలో ఇచ్చిన హామీలు, ఆయా ప్రభుత్వాల పాలనలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు జరిగిన మేలు, నష్టాలను ప్రజలు పరిశీలించాలని నాయకులు సూచించారు. రాజకీయ పార్టీల ప్రచారాన్ని మాత్రమే నమ్మకుండా వాస్తవాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని కోరారు.దళితులు, ఎస్టీలు, మైనారిటీల ఆత్మగౌరవం విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నాయకులు స్పష్టం చేశారు. దళిత వర్గాలను మరోసారి అవమానించేలా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణలోని దళిత సంఘాలు ఐక్యంగా స్పందిస్తాయని హెచ్చరించారు. సామాజిక సమానత్వం, దళితుల ఆత్మగౌరవం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జై శ్రీ, మహేష్, శంకరయ్య, పీటర్, నాగేష్, చంద్రయ్య, ప్రవీణ్, రవి, సందీప్, హనుమంతు, కిరణ్, శ్రీను, ప్రకాష్ తదితర దళిత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :