Thursday, 24 September 2026 09:05:28 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

పోలీసులకు ‘ఈ-సాక్ష్య’ అప్లికేషన్‌పై ప్రత్యేక శిక్షణ

Date : 24 June 2026 06:39 PM Views : 226

ప్రజా పిలుపు / తెలంగాణ / వికారాబాద్ : ప్రజా పిలుపు వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు నూతన సాంకేతికతతో రూపొందించిన ‘ఈ-సాక్ష్య’ (e-Sakshya) అప్లికేషన్ వినియోగంపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ, నేర స్థలంలో సేకరించే డిజిటల్ సాక్ష్యాధారాలైన ఫోటోలు, వీడియోలను నేరుగా ఎఫ్‌ఐఆర్ (FIR) నంబర్‌తో అనుసంధానం చేయడం ద్వారా వాటిని ఎలాంటి మార్పులు, చేర్పులు (ట్యాంపరింగ్) జరగకుండా అత్యంత భద్రతతో భద్రపరచవచ్చని తెలిపారు. ఈ విధానం దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు న్యాయస్థానాల్లో నేర నిరూపణ శాతాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. నూతన క్రిమినల్ చట్టాల అమలులో భాగంగా జిల్లాలోని అన్ని పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా ఈ-సాక్ష్య అప్లికేషన్‌ను వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, ఈ-సాక్ష్య కో-ఆర్డినేటర్ శ్రీనివాసన్, వికారాబాద్ డీఎస్పీ అంజయ్య, పరిగి డీఎస్పీ శ్రీనివాస్, తాండూర్ డీఎస్పీ ఎన్. యాదయ్యతో పాటు జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, ఈ-కాప్స్ సిబ్బంది పాల్గొన్నారు

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :