ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్ష లంచం తీసుకుంటున్న ఎస్‌ఐ బాలరాజుతో పాటు కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.ఓ భూ వివాదానికి సంబంధించిన కేసు నమోదు చేసిన పోలీసులు.. తదుపరి విచారణకు సంబంధించి డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఎస్‌ఐ బాలరాజు, కానిస్టేబుళ్లు రఘు, రాజ్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
Admin
ప్రజా పిలుపు