ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆగస్టు 15న సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సుమారు 1,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణచర్యలుచేపడుతున్నట్లుతెలిపారు.ముఖ్యమంత్రి పర్యటన భద్రతా ఏర్పాట్లపై జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం హెలిప్యాడ్, కాన్వాయ్ మార్గం, పార్కింగ్ ప్రాంతాలు, గంజీ మైదానం, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, హాస్టల్ గడ్డ, తారా కళాశాల, సీఎస్ఐ చర్చి, ఐబీ చౌరస్తా, అంబేద్కర్ స్టేడియం తదితర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.సభా ప్రాంగణంలో ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలు, ముఖ్యమంత్రి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ప్రజల రాకపోకలు, అత్యవసర సేవల నిర్వహణపై సంబంధిత అధికారులతో చర్చించారు. భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ముందస్తు ప్రణాళికతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.ముఖ్యమంత్రి సభకు వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కేటాయించారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి వచ్చే బస్సులకు గంజీ మైదానంలో, నారాయణఖేడ్, జిన్నారం, హత్నూర ప్రాంతాల బస్సులకు ప్రభుత్వ వైద్య కళాశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు.జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల బస్సులకు హాస్టల్ గడ్డ ఈద్గా వద్ద, పటాన్‌చెరు నియోజకవర్గం, ఇందిరేశం, ఇస్నాపూర్ ప్రాంతాల బస్సులకు నూతన బస్‌స్టాండ్‌లో పార్కింగ్ కేటాయించారు.నాలుగు చక్రాల వాహనాలకు మహబూబ్ సాగర్ చెరువు కట్ట, ప్రభుత్వ బాలికల పాఠశాలలో, ద్విచక్ర వాహనాలకు ప్రభుత్వ బాలుర పాఠశాలలో పార్కింగ్ ఏర్పాటు చేశారు. మీడియా వాహనాలకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పార్కింగ్ కేటాయించారు.సభకు వచ్చే వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే నిలిపి, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులకు సహకరించాలని అధికారులు సూచించారు.
Admin
ప్రజా పిలుపు