Thursday, 24 September 2026 08:05:29 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు*

రికార్డుల నిర్వహణ, దర్యాప్తు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి*

Date : 22 September 2026 05:26 PM Views : 14

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : వార్షిక తనిఖీల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ మంగళవారం నాగల్గిద్ద పోలీస్ స్టేషన్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్, డీఎస్పీ కార్యాలయ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది కిట్ ఆర్టికల్స్ తదితర అంశాలను పరిశీలించారు.నాగల్గిద్ద పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఎస్పీకి పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డీఎస్పీతో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లోని స్వాధీనం చేసుకున్న, కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు సంబంధిత ఆస్తులను కోర్టులో సమర్పించే వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు.స్టేషన్ రికార్డులను పరిశీలించిన ఎస్పీ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆస్తి సంబంధిత నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను క్రైమ్ ప్రోన్ ఏరియాలు, బ్లాక్ స్పాట్లుగా గుర్తించి పగలు, రాత్రి బీట్ విధుల్లో నిఘా పెంచాలని అన్నారు.రాష్ట్ర సరిహద్దుల నుంచి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే అక్రమ రవాణా జరగకుండా చెక్‌పోస్టుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టాలని ఎస్‌హెచ్‌ఓకు సూచించారు.సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్‌ప్రింట్ డివైస్ వంటి సాంకేతిక వ్యవస్థలపై సిబ్బంది పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని ఎస్పీ సూచించారు. నేరాల నియంత్రణ, ఛేదనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని అన్నారు.స్టేషన్ రికార్డుల్లో పార్ట్-1 నుంచి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో పోలీసులు మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలని ఎస్పీ సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండటంతో పాటు గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కొనసాగిస్తూ శాంతిభద్రతలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని సేకరించాలని అన్నారు.స్టేషన్ పరిధిలోని సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పగలు, రాత్రి బీట్ విధుల్లో వారిని తనిఖీ చేస్తూ వివరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని సూచించారు. పాపిలాన్ డివైస్‌ను వినియోగిస్తూ అనుమానితులను తనిఖీ చేసి, వేలిముద్రల ద్వారా పాత నేరస్తులను గుర్తించాలని తెలిపారు.మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, ప్రతి పోలీసు సిబ్బంది అన్ని రకాల విధులపై అవగాహన కలిగి తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. విధి పరంగా లేదా వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.అనంతరం నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ సందర్శించి కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పోక్సో, అత్యాచారం, డౌరీ డెత్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు జరిగేలా ఎస్‌హెచ్‌ఓలకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని డీఎస్పీని ఆదేశించారు. ప్రతి నెల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు. అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న గ్రామాల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.రోడ్డు ఇంజనీరింగ్‌లో లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమన్వయం చేసుకుని మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.నేరాల ఛేదన, నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.నారాయణఖేడ్ ప్రాంతం ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కలిగి ఉన్నందున అక్రమ రవాణాకు అవకాశం లేకుండా సరిహద్దుల్లో నిఘా కట్టుదిట్టం చేయాలని అన్నారు. నాకాబందీ వంటి తనిఖీలు నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత భూమిని జప్తు చేసేందుకు సిఫారసు చేయాలని డీఎస్పీని ఆదేశించారు.నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయం, నాగల్గిద్ద పోలీస్ స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉందని ఎస్పీ పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులను ప్రకటించారు.ఈ వార్షిక తనిఖీల సందర్భంగా నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, నారాయణఖేడ్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కంగ్టీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సబ్‌-డివిజన్ ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :