Sunday, 08 November 2026 02:34:01 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం..అమరవీరుల సేవలు పోలీసు శాఖకు స్ఫూర్తిదాయకం*

అమరవీరులకు ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్, ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్

Date : 21 October 2026 11:34 AM Views : 83

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : ప్రజల ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐఏఎస్‌తో కలిసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన సిర్గాపూర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన జంగయ్య, సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎల్లయ్య, జిన్నారం పోలీస్ స్టేషన్‌కు చెందిన సత్యనారాయణ, కంగ్టి పోలీస్ స్టేషన్‌కు చెందిన సురేష్ ప్రజల రక్షణ కోసం చేసిన సేవలు, త్యాగాలు ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.అనంతరం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ మాట్లాడుతూ, 1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పది మంది భారత పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రత కోసం విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే పోలీసులు ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంతంలో గతంలో నక్సలిజం ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో అనేక మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని ఎస్పీ గుర్తుచేశారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన నలుగురు పోలీస్ అమరవీరులు జంగయ్య, ఎల్లయ్య, సత్యనారాయణ, సురేష్ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి సేవలు పోలీసు శాఖకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వీరమరణం పొందిన 154 మంది పోలీసు సిబ్బందిని ఈ సందర్భంగా స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఎస్పీ అన్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన నలుగురు పోలీసు సిబ్బంది ఉన్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, దేశ అంతర్గత భద్రత, ప్రభుత్వ ఆస్తుల రక్షణతో పాటు ప్రజల్లో భద్రతాభావాన్ని కల్పించడంలో పోలీసు శాఖ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి పోలీసు అధికారి, సిబ్బందికి స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నుంచి అక్టోబర్ 31న నిర్వహించే సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి, జాతీయ ఐక్యత దినోత్సవం వరకు ప్రజలకు పోలీసు శాఖను మరింత చేరువ చేసే కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీసు–ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేస్తూ, ప్రజల్లో పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రథమ కర్తవ్యం. అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజల రక్షణ కోసం ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :