Thursday, 24 September 2026 08:55:50 AM
# 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు # ముత్తంగిలో అన్నదానం, ప్రత్యేక పూజా కార్యక్రమం # హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన* # ముత్తంగిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి # ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్ # యాదగిరిగుట్టపై విషాదం.. కారు ఢీకొని యాచకురాలు మృతి # రాష్ట్ర స్థాయిలో సత్తా చాటండి # క్రీడల్లో రాణిస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవడంతో పాటు ఉద్యోగ అవకాశాలు త్వరగా లభిస్తాయి: మంత్రి పొన్నం ప్రభాకర్ # హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన.భద్రత, లైటింగ్, ట్రాఫిక్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి # నాగల్గిద్ద పీఎస్, నారాయణఖేడ్ డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ వార్షిక తనిఖీలు* # అనంతారం పాఠశాలలో పచ్చదనానికి శ్రీకారం # సర్వే నంబర్ 325 భూములకు పట్టాలు ఇవ్వాలని ఎర్రవల్లి యాదవుల విజ్ఞప్తి*

గుమ్మడిదల అభివృద్ధికి సంపూర్ణ సహకారం*

*రూ.1.69 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి*

Date : 24 August 2026 01:36 PM Views : 53

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గుమ్మడిదల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తూ మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.సోమవారం గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని బొంతపల్లిలో న్యూల్యాండ్ పరిశ్రమ సహకారంతో రూ.86.50 లక్షలతో చేపట్టనున్న రెండు ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. వీరన్నగూడెంలో రూ.15 లక్షల సీఆర్‌ఆర్ నిధులతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాలువల నిర్మాణ పనులకు, గుమ్మడిదలలో హానర్ ల్యాబ్స్, మైత్రి పరిశ్రమల సౌజన్యంతో రూ.45 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, యూజీడీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నాగిరెడ్డిగూడెంలో న్యూల్యాండ్ పరిశ్రమ సహకారంతో రూ.22 లక్షలతో నిర్మించిన ఓవర్‌హెడ్ ట్యాంకును ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వాటికి శాశ్వత పరిష్కారం చూపేలా పనులు చేపడుతున్నామని అన్నారు.రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రతి కాలనీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని చెప్పారు. గుమ్మడిదల ప్రాంత అభివృద్ధిలో పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక బాధ్యతతో భాగస్వామ్యం కావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు పరిశ్రమల సహకారం అందితే అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేయవచ్చని తెలిపారు.అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడా రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గుమ్మడిదల మున్సిపాలిటీని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుమార్ గౌడ్, వైస్ చైర్మన్ సంధ్య గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ దశరథ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :