ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో రానున్న పండుగ పర్వదినాల సందర్భంగా చేపట్టనున్న పూల అలంకరణ, రంగులు–సున్నం వేయడం, విద్యుత్ దీపాలంకరణ పనుల కోసం బుధవారం సీల్డ్ కం బహిరంగ టెండర్లను నిర్వహించారు.టెండర్లలో పూల అలంకరణ పనులను కౌలంపేటకు చెందిన పి. రాజు దక్కించుకోగా, రంగులు–సున్నం వేయుటకు అశోక్‌నగర్‌కు చెందిన హెచ్. సిద్ధిరాం రెడ్డి టెండర్‌ను సొంతం చేసుకున్నారు.విద్యుత్ దీపాలంకరణ పనులకు సంబంధించి ఎలాంటి దరఖాస్తులు రాకపోవడంతో ఆ పనుల కోసం మరోసారి టెండర్ నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి లావణ్య, ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Admin
ప్రజా పిలుపు