ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, బాధ్యతలకు రక్షాబంధన్ పండుగ సాక్ష్యంగా నిలుస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ముదిరాజ్ అన్నారు. శుక్రవారం రాఖీ పండుగను పురస్కరించుకుని పలువురు మహిళలు నీలం మధు నివాసానికి చేరుకుని ఆయనకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నీలం మధు వారికి మిఠాయిలు అందించి ఆప్యాయంగా పలకరించారు.అనంతరం నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ భారతీయ సంస్కృతిలో ఎంతో పవిత్రమైన పండుగ అని అన్నారు. ఇది కేవలం ఒక దారాన్ని కట్టే సంప్రదాయం మాత్రమే కాదని, పరస్పర విశ్వాసం, ఆత్మీయత, రక్షణకు ఇచ్చే మాటకు ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, భద్రంగా జీవించే వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని నీలం మధు తెలిపారు. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అన్నారు. సోదరభావం, సామాజిక ఐక్యతను పెంపొందించే రక్షాబంధన్ వంటి పండుగలు ప్రజల మధ్య ఆత్మీయతను మరింత పెంచుతాయని పేర్కొన్నారు.
Admin
ప్రజా పిలుపు