Sunday, 08 November 2026 06:48:13 PM
# పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్ # గారకుర్తిలో దూడలకు నులిపురుగుల నివారణ మందుల పంపిణీ # కొండపోచమ్మ ఆలయ హుండీ ఆదాయం రూ.9.82 లక్షలు # తాత్కాలిక టపాసుల దుకాణాలపై 18 శాతం జీఎస్టీ.. వ్యాపారుల ఆవేదన # ఇంద్రేశంలో సినిమా చిత్రీకరణ సందడి # ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాల కూల్చివేత # యోగా సాధనతో మానసిక ప్రశాంతత.. మెరుగైన ఆరోగ్యం # రూ.20 వేల లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన వ్యవసాయ అధికారి* # హైటెన్షన్ విద్యుత్ తీగ తగిలి యువకుడు మృతి # అకాల వర్షానికి తడిసిన రైతుల ధాన్యం...సోలక్పల్లిలో ముగ్గురు రైతులకు నష్టం # ప్రజావాణికి 68 దరఖాస్తులు # పటాన్‌చేరులో కురుస్తున్న వర్షం.. ఒక్కసారిగా మారిన వాతావరణం # మైనారిటీ ఫంక్షన్ హాల్ ఎదుట చెత్త కుప్పలు.. డంపింగ్ యార్డును తలపిస్తున్న రహదారి! # సోలక్‌పల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

అనంతగిరి బస్సు ప్రమాదంపై ఎమ్మెల్యే జిఎంఆర్ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

Date : 03 October 2026 01:21 PM Views : 240

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు: వికారాబాద్ జిల్లా అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రైవేటు బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనపై పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులంతా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం, పటాన్చెరు మండలం క్యాసారం గ్రామానికి చెందిన వారేనని తెలిపారు. బంధువుల అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం తీవ్ర విషాదకరమన్నారు.క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైన వారిని వెంటనే కార్పొరేట్ ఆసుపత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రమాద ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమైందని ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు మృతి చెందడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :