ప్రజా పిలుపు / తెలంగాణ / మెదక్ : నర్సాపూర్ : పదవి ఉన్నా లేకున్నా ప్రజా సేవే లక్ష్యంగా మాజీ జెడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా శివ్వంపేట మండలంలో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. కుల, మత, పార్టీలకు అతీతంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం, నిరుపేదలకు వైద్య ఖర్చుల సహాయం, పండుగల సందర్భంగా అన్నదానం, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు.తాజాగా శివ్వంపేట గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకురావడంతో స్పందించారు. తన సొంత నిధుల నుంచి సుమారు రూ.5 లక్షలు వెచ్చించి కోతులను పట్టించే చర్యలు చేపట్టారు. ఎలాంటి హాని కలగకుండా నిబంధనల ప్రకారం వాటిని పట్టుకుని అడవిలో వదిలేలా చర్యలు తీసుకున్నారు.పదవులు శాశ్వతం కావని, ప్రజలతో ఉన్న అనుబంధమే శాశ్వతమనే భావనతో ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్న మహేష్ గుప్తా తీరుపై స్థానికంగా చర్చ జరుగుతోంది.
Admin
ప్రజా పిలుపు