Wednesday, 11 November 2026 04:47:35 PM
# నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం # శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. # నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు.. # ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి # ఇస్నాపూర్ నూతన సీఐ టి. మహేష్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన నిజాముద్దీన్ బాబా # బీరంగూడ కమాన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. బోల్తాపడిన బస్సు # యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.50 లక్షల విరాళం..దాతలు ముందుకు రావడం సంతోషం: డిజిపి సి. వి. ఆనంద్ # పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి # యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న* # భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, అయ్యప్ప స్వామి ఆలయాల్లో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు ప్రత్యేక పూజలు # సంగారెడ్డి జిల్లాలో భారీ మొసలి కలకలం.. రైతుల్లో భయాందోళన # పేద కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.60 వేల ఆర్థిక సహాయం # గుంతలమయంగా మారిన రోడ్డుకు మరమ్మతులు చేయాలని బీజేపీ నాయకుల ధర్నా* # పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి నిరుపేద కుటుంబానికి అండగా ఉంటాం # నవ్య ఎక్స్‌ రోడ్డులో వెలగని వీధి దీపాలు # 12 గంటల్లోనే బాలుర ఆచూకీ గుర్తింపు # దీపావళి టపాసుల దుకాణదారులకు పోలీసుల సూచనలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు # జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట # దేవుడి సొమ్ముకు లెక్క చెప్పాల్సిందే!* # గుడి నిర్మాణ పనులను అడ్డుకోవడం సరికాదు: కాట శ్రీనివాస్ గౌడ్

నవంబర్ 15న పటాన్‌చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజ వేడుకలు..ఎమ్మెల్యే జీఎంఆర్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు..

ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య సంగీత విభావరి...ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

Date : 11 November 2026 02:44 PM Views : 35

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్‌చెరు: ఉత్తర భారతీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే ఛట్ పూజ వేడుకలను ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంత్రం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని సాకి చెరువు వేదికగా ఘనంగా నిర్వహించనున్నట్లు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (జీఎంఆర్) తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఛట్ పూజ ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యే జీఎంఆర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా పటాన్‌చెరు వేదికగా ఛట్ పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాలతో పాటు తన సొంత నిధులతో భక్తులకు ఉచితంగా చెరుకును పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది వేడుకల్లో భాగంగా ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరీ నిర్వహించనున్నట్లు తెలిపారు.పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ఉత్తర భారతీయుల సంక్షేమానికి నిరంతరం అండగా నిలుస్తూ, వారి అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రజలతో సమానంగా ఇతర రాష్ట్రాల ప్రజలను కూడా ఆదరిస్తూ, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఛట్ పూజ వేడుకల్లో భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జీఎంఆర్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డి, రాజు, సుధాకర్ గౌడ్, సంజయ్ సింగ్, టింకు తదితరులు పాల్గొన్నారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :