ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : పటాన్చెరు నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రొవిజనల్ సర్టిఫికెట్ కోసం మత్స్య సంఘంలో ఉన్న అభ్యర్థుల నుంచి అనధికారికంగా రూ.150 వసూలు చేస్తున్నారని మత్స్య సంఘం సభ్యులు ఆరోపించారు. అంతేకాకుండా ఈ రూ.150 వసూలు చేసినప్పటికీ ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని వారు తెలిపారు.ఈ విషయంపై సంబంధిత వారిని ప్రశ్నించగా, ఆధార్ కార్డు తయారీకి మీ సేవా కేంద్రాల్లో రూ.100 తీసుకోవడం లేదా అంటూ సమాధానం ఇస్తున్నారని మత్స్య సంఘం సభ్యులు పేర్కొన్నారు. అయితే ప్రొవిజనల్ సర్టిఫికెట్ కోసం వసూలు చేస్తున్న రూ.150కు రసీదు ఇవ్వకపోవడంపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు.ప్రభుత్వ సేవలకు సంబంధించిన ప్రక్రియలో నిర్ణయించిన రుసుములు మాత్రమే వసూలు చేయాలని, అదనంగా డబ్బులు వసూలు చేస్తే దానిపై అధికారులు విచారణ జరపాలని మత్స్య సంఘం సభ్యులు కోరారు.ఇకనైనా సంబంధిత మత్స్యశాఖ అధికారులు చొరవ తీసుకొని ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు అనధికారిక వసూళ్లు జరుగుతున్నట్లు తేలితే బాధ్యులపై అధికారికంగా చర్యలు తీసుకోవాలని మత్స్య సంఘం సభ్యులు విజ్ఞప్తి చేశారు.
Admin
ప్రజా పిలుపు