ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : గంజాయి అక్రమ రవాణాపై అబ్కారీ శాఖ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. జిల్లాలోని ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారం గ్రామంలో మెదక్ ఎన్ఫోర్స్మెంట్ అబ్కారీ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1 కిలో 855 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్ జైస్వాల్ అనే వ్యక్తి గంజాయి సరఫరాలో పాల్గొంటున్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి, తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.జిల్లాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, ఇలాంటి కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అబ్కారీ అధికారులు హెచ్చరించారు.
Admin
ప్రజా పిలుపు