ప్రజా పిలుపు / తెలంగాణ / హైద్రాబాద్ : పటాన్‌చెరు: శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ సంఘం చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీశ్‌రావు, తెలంగాణ రాష్ట్ర మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, పటాన్‌చెరు నియోజకవర్గ సమన్వయకర్త వెన్నవరం ఆదర్శ్‌రెడ్డి రాగం కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, ధైర్యం చెప్పారు.ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య యాదవ్, రాఘవరావు, మణికి యాదవ్, కలవగడ్డ రాజ్‌కుమార్, చిన్న చిన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.రాగం సుజాత యాదవ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని పలువురు ఆకాంక్షించారు.
Admin
ప్రజా పిలుపు