Friday, 25 September 2026 09:29:55 AM
# 83 మంది లబ్ధిదారులకు రూ.35.30 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ # శ్రీ వరసిద్ధి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గణనాథుడి నిమజ్జనం # జోగిపేట ట్రాన్సిట్ హోంను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు* # భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంగారెడ్డి జిల్లా అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం* # వినాయక నిమజ్జనాలకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు..శోభాయాత్ర మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో ప్రత్యేక బందోబస్తు* # బీరువా తాళం పగులగొట్టి బంగారం, వెండి, నగదు అపహరణ # శంకర్‌పల్లి–ఫతేపూర్ బ్రిడ్జి వద్ద వినాయక నిమజ్జనంలో ప్రమాదం # రెండు గంటల్లోనే తప్పిపోయిన చిన్నారిని కుటుంబానికి అప్పగించిన నర్సాపూర్ పోలీసులు # సాకి చెరువును పరిశీలించిన సైబరాబాద్ పోలీస్ కమిషనర్ # నర్సాపూర్‌లో గుర్తు తెలియని చిన్నారి – తల్లిదండ్రుల కోసం పోలీసుల గాలింపు # 12వ వార్డులో ఘనంగా వినాయక నిమజ్జనం # పటాన్‌చెరులో ఘనంగా ప్రైవేట్ పాఠశాలల గురుపూజోత్సవ వేడుకలు* # క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు* # హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలి* # ఉత్తమ ఉపాధ్యాయురాలిగా షెహనాజ్ బేగంకు అవార్డు* # సెప్టెంబర్ 26న వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు* # జూదాం కేసులో ఇద్దరికి 30 రోజుల రిమాండ్, 8 మందికి జరిమానా* # నాగులపల్లిలో కలుషితమవుతున్న మిషన్ భగీరథ తాగునీరు # హత్నూరలోని వీఎస్పీ ఇస్పాత్ స్టీల్ పరిశ్రమలో ఐటీ అధికారుల సోదాలు

క్యాబ్‌ డ్రైవర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు*

మరో ఇద్దరి కోసం పోలీసుల గాలింపు

Date : 23 September 2026 08:06 PM Views : 32

ప్రజా పిలుపు / తెలంగాణ / సంగారెడ్డి : * క్యాబ్‌ డ్రైవర్‌ను హత్య చేసి కారును అపహరించిన కేసును పటాన్‌చెరు పోలీసులు ఛేదించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబరు 10, 11 తేదీల మధ్య రాత్రి ఐదుగురు నిందితులు సికింద్రాబాద్‌ నుంచి ముంబయికి వెళ్లాలని చెప్పి క్యాబ్‌ డ్రైవర్‌ నెలమర్రి రాజశేఖర్‌ కారును అద్దెకు తీసుకున్నారు. రుద్రారం గ్రామ శివారుకు చేరుకున్న తర్వాత డ్రైవర్‌పై దాడి చేసి టవల్‌తో గొంతు బిగించి హత్య చేశారు. మృతదేహాన్ని నిర్మాణంలో ఉన్న రోడ్డు పైవంతెన సమీపంలో పడేసి కారులో ముంబయి వైపు వెళ్లారు. కోహీర్‌ వద్ద కారు చెడిపోవడంతో గోల్డెన్‌ ధాబా సమీపంలో వదిలేసి జహీరాబాద్‌ వైపు వెళ్లారు.ముంబయిలో బంగారు దుకాణాల్లో దొంగతనాలు చేసి, అనంతరం కారును విక్రయించాలని నిందితులు పథకం వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తులో ఆధారాలు సేకరించి ఘోడకే రాహుల్‌ (28), సూరజ్‌ శశికాంత్‌ తావడే (29), బాంబ్లే రాజు రామచంద్ర (33)లను అరెస్టు చేశారు. వీరంతా మహారాష్ట్రకు చెందినవారు.మయూర్‌ రాజేంద్ర దివేకర్‌, శివ శంకర్‌ శర్మ పరారీలో ఉన్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు కొనసాగుతోంది.అరెస్టయిన నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. డీసీపీ సీహెచ్‌. శ్రీనివాస్‌, ఏసీపీ సీహెచ్‌వై. శ్రీనివాస్‌ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్‌ ఎం. రవీందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు కేసును ఛేదించారు.

Vijay Kumar

Admin

ప్రజా పిలుపు

మరిన్ని వార్తలు

Copyright © Praja Pilupu 2026. All right Reserved.



Developed By :